ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రo
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; డిసెంబర్ 14 ,15 తేదీలలో సిపిఎం కడప జిల్లా 12వ మహాసభలు కడప నగరంలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మనోహర్ తెలిపారు బుధవారం జమ్మలమడుగు పట్టణంలో యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిపిఎం పార్టీ గ్రామస్థాయి శాఖ నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ మహాసభలలో చర్చించి ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు ఈ మహాసభలలో గత కార్యక్రమాల సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలను నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. ఈ మహాసభలలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కోసం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు నికరజలాలు పరిశ్రమల కోసం కడప జిల్లా మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ మహాసభ నవంబర్ 20వ తేదీన జమ్మలమడుగు పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని కేంద్ర రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. జిల్లా మహాసభలు జయప్రదానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన జిల్లా ప్రజానీకానికి పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి ,జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి జి.యేసుదాసు నాయకులు ఏ.వినయ్ కుమార్ దాసరి.విజయ్, యుద్ధం నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.