రోడ్డు ప్రమాద బాధితులకు అండగా కేంద్రం కొత్తపథకం

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా కేంద్రం కొత్తపథకం

పత్తికొండ, న్యూస్ వెలుగు: నితిన్ గడ్కరీకి ప్రత్యేక అభినందనలు తెలిపిన లోక్ సత్తాపార్టీ!! కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని లోక్ సత్తాపార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనంద్ ఆచారి, తాలూకా అధ్యక్షుడు జయరాముడు అన్నారు.

గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్టంగా రూ 1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, ప్రమాదం ఘటన జరిగిన 24 గంటల్లో పోలీసులకు తప్పకుండా సమాచారం అందించాలని, అలాగే హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియను అందిస్తామని గడ్కరీ ప్రకటించడం విశేషమని, ఇప్పటికే దేశంలోని అస్సోం, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, పాండిచ్చేరి, హర్యానాలో 6,840 మంది ఈ స్కీం ద్వారాలబ్ధి పొందారని 2025 మార్చి నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారని, దేశవ్యాప్తంగా 2024లో 1.80 లక్షల మంది రోడ్డుప్రమాదంలో చనిపోయారని దీనిలో 30 వేలమంది కేవలం హెల్మెట్ ధరించక చనిపోయా రని, రోడ్డు ప్రమాదంలో 66 శాతం మంది 18 నుండి 34 ఏళ్ల లోపు యువతే ఉన్నారని, విద్యా సంస్థలు వద్ద ఎంట్రీ, ఎగ్జిట్, పాయింట్స్ సరిగా లేక 10 వేలమంది పిల్లలు రోడ్డు ప్రమాదాల బారినపడ్డారని గడ్కరీ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశమని ఆనంద్ ఆచారి  అన్నారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జాతీయ స్థాయిలో సాంకేతిక వ్యవవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారని, లక్షన్నరతో ఉచిత చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేసిన నితిన్ గడ్కరీకి లోక్ సత్తాపార్టీ నుండి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!