ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు లో కేంద్ర జోక్యం కుట్రపూరితం

ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు లో కేంద్ర జోక్యం కుట్రపూరితం

హొళగుంద, న్యూస్,వెలుగు: భారతీయ ముస్లిముల ధార్మిక సంపద సంస్థ “ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు” లో అనవసర జోక్యంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇస్లాం ధర్మపు ధార్మిక భావనలకు భంగం వాటిల్లేలా తేవబోతున్న ప్రజాస్వామ్య విరోధ చట్టం వక్ఫ్ బోర్డు సవరణ-2024 కు వ్యతిరేకంగా శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు హొళగుంద ముస్లిమ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరుపున ప్రజాస్వామ్యబద్ధంగా పెద్దఎత్తున నిరసనను నిర్వహించారు.నిరసన కార్యక్రమంలో వక్తలు జామియా మసీదు పండితులు మౌలానా హాబిబుల్లా జామయి మాట్లాడుతూ ఇస్లాం పరిభాషలో వక్ఫ్ అంటే ఒక ముస్లిము వ్యక్తి దైవభక్తి , ప్రేమతో ఇస్లాం ధర్మం మరియు ముస్లిముల అభ్యున్నతికై తన స్వంతానికి చెందిన ధనాన్ని,వస్తువులను లేదా ఆస్తిని నిరాపేక్షంగా ధర్మ మార్గంలో అప్పజెప్పడాన్ని వక్ఫ్ అంటారు.  ఒకసారి ఒక వ్యక్తి , సంస్థ ఇస్లాం ధర్మ మార్గంలో తమకు చెందిన దానిని దానపు ఉద్దేశంతో వక్ఫ్(శాశ్వత దానం) చేస్తె సదరు ఖరీదు, ఆస్థుల పై సంపూర్ణ శాశ్వత యాజమాన్య అధికారం వక్ఫ్ బోర్డుకు చెందితీరుతుంది.అంతేకాకుండా భారత రాజ్యంగం ప్రకారం సదరు వక్ఫ్ సంపదలకు సంబంధంచిన పరిపాలన పర్యావేక్షణ విషయంలో ‘ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు’కు సంపూర్ణంగా హక్కు బాధ్యతలున్నాయి.కాగా ప్రభుత్వం కూడా భారతీయ నాగరిక సంపద పరిరక్షణకు పాటుపడాలే తప్ప వాటిని నిర్విర్యం చేసే మార్గాలను ఉత్పన్నం చేయకూడదన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!