ఏపీ లో 8 కేంద్ర విద్యాలయాలను కేంద్రం మంజూరు
న్యూస్ వెలుగు, అమరావతి; ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఈ మధ్యనే తిరుపతి ఐఐటీకి ఒకటి మంజూరు చేసారు. దీంతో మొత్తం 9 కేంద్రీయ విద్యాలయాలను సాధించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో రానున్నాయి నాణ్యమైన విద్యాప్రమాణాలకు పేరొందిన కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం ఏపీలో 35 ఉన్నాయి. వీటిల్లో 6594 మంది ఎస్సీ, 1476 మంది ఎస్టీ, 96 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 9తో కలిపితే మొత్తం ఏపీలో 44 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్టు. #9KendriyaVidyalayasToAP #IdhiManchiPrabhutvam #AndhraPradesh https://manatdp.org/feedview/8323/0