సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించిన చంద్రబాబు

సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించిన చంద్రబాబు

మాజీమంత్రి సాకే శైలజనాథ్

కర్నూలు, న్యూస్ వెలుగు; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలును అటకెక్కించారని తిరుమల లడ్డు ప్రసాదంతో పక్కదోవ పట్టిస్తున్నాడని, మాజీమంత్రి సాకె శైలజనాథ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజనాథ్  మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని ఆంధ్రప్రదేశ్ ను ఏమి చేయదలచుకున్నారని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు లను అడుగుతున్నానని 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని ఉచిత బస్సు, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మొదలగు ఆరు సూపర్ సిక్స్ పథకాలను తుంగలో తొక్కారని విద్య, వైద్యం పూర్తిగా విస్మరించారని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మిమ్ములను గెలిపించిన ప్రజలకు మేలు చేయండి అని చైతన్య నారాయణ కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చాయని, రైతులు రాయలసీమలో 50,000 ఎకరాలలో పంటలు వేయలేదని రైతు సమస్యలపై మాట్లాడడం లేదని 18 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం తెచ్చిందని వాటిలో మౌలిక వసతులు సరిగా లేవని వాటిని ప్రైవేట్ పరం చేయడం హాశాస్పదంగా ఉందని ప్రైవేట్ పరం చేస్తే 50% సీట్లు మేనేజ్మెంట్ కోట కిందకు పోతాయని మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు వర్తించవని తెలియజేశారు. మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేయకూడదని కర్నూలులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని విజయవాడకు తరలించకూడదని డిక్లరేషన్ పై రాజ్యాంతం అవసరం లేదని శైలజనాథ్ గారు తెలియజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలను తెరపైకి తెస్తూ చంద్రబాబు పాలన సాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, కాంగ్రెస్ నాయకులు ఎన్ సి బజారన్న, అనంతరత్నం, ఈ లాజరస్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన్, ఖాదిరి పాషా, సయ్యద్ నవీద్, ఎజాస్ అహ్మద్, బి సుబ్రహ్మణ్యం, యు శేషయ్య, ఐఎన్టియుసి ఎన్ సుంకన్న, ప్రతాప్, సావిత్రి మొదలగువారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!