
ఇళ్ల స్థలాల పై చంద్రబాబు ప్రభుత్వం హామీని నెరవేర్చాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; పేదలకు పట్టణాలలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని,ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాల అర్హుల జాబితా,పంపిణీ పై తక్షణం దృష్టి సారించాలని సిపిఐ జమ్మలమడుగు కార్యదర్శి ప్రసాద్ కా డిమాండ్ చేశారు. సోమవారం నాడు జమ్మలమడుగు ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తాసిల్దారు మైనుద్దీన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూపేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయా ఇళ్లస్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యంకాని ప్రాంతాలలో కేటాయించడం జరిగింది. అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్లస్థలాలు చూపలేదు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు)లు ఆనాడే వైసిపి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు యిచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాలపట్ల సుముఖత చూపలేదు.