
రద్దీరోజులందు స్పర్శదర్శనంలో మార్పులు
న్యూస్ వెలుగు, శ్రీశైలం ; శ్రీశైలమహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగాను సర్వదర్శన క్యూలైనులోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీరోజులందు శ్రీస్వామివారి స్పర్శదర్శన ఏర్పాటు విషయములో మార్పులు చేయబడ్డాయి.
ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతీ శని,ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే స్పర్శదర్శనానికి అవకాశం కల్పించబడుతుంది.
ఈ రద్దీరోజులందు ఉదయం గం. 7.30ని.లకు, రాత్రి గం.9.00లకు మాత్రమే ఈ స్పర్శదర్శనం కల్పించబడుతుంది. ఇతర సమయమంతా కూడా శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.
ఈ రద్దీరోజులలో గతంలో అమలులో ఉన్న మధ్యాహ్న కాలపు స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడింది.
భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవలసి ఉంటుంది. ఒక్కొక్క విడతలో కేవలం 500 టికెట్లు మాత్రమే జారీ చేయబడుతాయి.
అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ప్రతీ శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవురోజులలో ఆర్జిత కుంకుమార్చనలు ( సేవా రుసుము రూ.1000/-లు) అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో నిర్వహింపబడుతాయి.
కావున భక్తులు ఈ మార్పులను గమనించవలసినదిగా తెలియజేయడమైనది.