చెరుకులపాడు పోలీసు పికెట్ ను తనిఖీ చేసి జిల్లా ఎస్పీ
కర్నూలు, న్యూస్ వెలుగు; క్రిష్ణగిరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ క్రిష్ణ గిరి మండలం, చెరుకులపాడు ఫ్యాక్షన్ గ్రామంలో పర్యటించి చెరుకుల పాడు పోలీసు పికెట్ ను తనిఖీ చేసి రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్ ను క్రిష్ణగిరి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ తనిఖీలలో భాగంగా పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీ షీట్స్ , సస్పెక్ట్స్ షీట్స్, హిస్టరీ షీట్స్ ను పరిశీలించారు. పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు.ఫ్యాక్షన్ గ్రామాల గురించి ఆరా తీశారు.అనంతరం క్రిష్ణ గిరి మండలం , చెరుకులపాడు ఫ్యాక్షన్ గ్రామంలో జిల్లా ఎస్పీ పర్యటించారు. పోలీసు పికెట్ ను తనిఖీ చేశారు.ఎస్సై, పోలీసు సిబ్బందితో మాట్లాడి , పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరస్తుల పై నిఘా ఉంచాలన్నారు.ఆయా గ్రామాల పరిస్ధితి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల ప్రజలతో సమన్వయంతో మంచి సత్ససంబంధాలు కలిగి ఉండాలన్నారు.సైబర్ నేరాలకు గురి కాకుండా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా ఎస్పీ తో పాటు సిఐలు ప్రసాద్, మధుసుధన్ రావు, ఎస్సై కె. మల్లికార్జున ఉన్నారు.