చికెన్ వ్యర్థాలను నగరపాలక వాహనాలకే ఇవ్వాలి
నగరపాలక ప్రజారోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి
ఇతరులు ఎవరైనా సేకరిస్తే కఠిన చర్యలు
న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; నగర పరిధిలో ఉన్న చికెన్ మాంసపు దుకాణదారులు తప్పనిసరిగా తమ దుకాణాల్లో వెలువడే వ్యర్థాలను నగరపాలక వాహనాలకే ఇవ్వాలని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. చికెన్ వ్యర్థాల నిర్వహణ కోసం టెండర్ వేసేంత వరకు తప్పనిసరిగా నగరపాలక సంస్థ వాహనాలకే వ్యర్థాలను ఇవ్వాలని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా వ్యర్థాలను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి షాపు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వ్యర్ధాలను సేకరించిన వాహనాలను సైతం సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసపు దుకాణదారులు నగరపాలక సంస్థకు సహకరించాలని ప్రజారోగ్య అధికారి విజ్ఞప్తి చేశారు.