
రాజధాని మాస్టర్ ప్లాన్ పై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు ఎపి సచివాలయం: రాజధాని సుందరీకరణ, గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై అధికారులకు సూచనలు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM