విజయవాడ వరద బాధితులకై సేకరించిన రూ.5 లక్షల చెక్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేత
హోళగుంద, న్యూస్ వెలుగు:విజయవాడలో అధిక వర్షాల కారణంగా వరదల్లో బాధితులుగా చిక్కుకున్న విజయవాడ వరద బాధిత ప్రజల సమస్యలను గమ నించిన ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం వరద బాధితుల సహాయ సమైఖ్య ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు,యువత,కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిక చెయ్యి చెయ్యి కలిపి చేయూతను కల్పించే ధృఢ సంకల్పంతో విజయవాడ వరద బాధితుల కోసం గత వారం రోజుల నుండి వాడవాడల సాగిన విరాళాల సేకరణతో సేకరించిన రూ.5 లక్షల నగదు,బియ్యం విరాళాలను టీడీపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,టీడీపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు రూపంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,బుడజంగల్ లక్ష్మణ, ఖాదర్,వార్డు సభ్యులు సుభాన్,జనసేన మండల కన్వీనర్ అశోక్, తిక్క స్వామి, మల్లి,శ్రీరంగ తదితరులు పాల్గొన్నారు.