పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
కడప జిల్లా న్యూస్ వెలుగు : జమ్మలమడుగు మండలం, గూడెంచెరువులో శుక్రవారం జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ‘ప్రజా వేదిక సభ’లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు వితంతు పింఛన్ ను స్వయంగా అందచేశారు. అలివేలమ్మ పెద్ద కుమారుడు వేణుగోపాల్ జీవన పరిస్థితులు తెలుసుకున్నారు. ఆయన పిల్లలకు ‘తల్లికి వందనం’ స్కీమ్ కింద లబ్ది చేకూరిందని తెలుసుకుని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అలివేలమ్మ చిన్న కుమారుడు ఆటో డ్రైవర్ జగదీష్ తో మాట్లాడుతూ ఆయన ఆటోలో సీఎం ప్రయాణించారు.
Was this helpful?
Thanks for your feedback!