న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామానికి చెందిన గద్దె .భువనేశ్వరి అనే బాధితురాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం ఇటీవల కాలంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవడంతో 2,50,454 రూపాయలు సహాయ నిధిని ప్రభుత్వం కేటాయించారు. ఈ నేపథ్యంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం మంగళవారం ఆ గ్రామానికి చేరుకుని బాధిత

కుటుంబానికి 2,50,454 మొత్తాన్ని చెక్కు రూపేనా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తూ ఉందని కష్ట కాలంలో నేనున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బు మొత్తానికి కేటాయించి బాధ్యతగా ఆదుకుంటున్నారని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలని కూటమి యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వము ఆ దిశగా పరుగులు వేస్తూ ప్రయాణం సాగిస్తోందని తెలిపాడు. గత ప్రభుత్వంలో బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరికి కూడా నిధులు కేటాయించకపోవడం ప్రతి ఒక్కరూ స్వయంగా చూశారని ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులకు దారి తీసేందుకు అవకాశమే లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుఖవాసి. బాలసుబ్రమణ్యం ఒంటిమిట్ట చెరువు, చైర్మన్లు, ఉప చైర్మన పాటూరు. గంగిరెడ్డి , కట్టా. యానాదయ్య, మండల టిడిపి ఇన్చార్జ్ గజ్జల .నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, కొత్తపల్లి .బొబ్బిలి రాయుడు, పాటూరు. గంగిరెడ్డి, కట్ట .యానాదయ్య, పత్తి. సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.
-
Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings
View all posts
Thanks for your feedback!