చదువు ప్రాధాన్యతను పిల్లలకు తెలపాలి
హొళగుంద, న్యూస్ వెలుగు; హోలగుంద గ్రామంలోని KGBV స్కూల్ ను సందర్శించడం జరిగినది. మంగళవారం పిల్లలకు చదువు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మాత్రమే తల్లిదండ్రులకు ప్రేమ, బాధ, కష్టంగా ఉన్నా కానీ పిల్లను దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తారని, కావున ప్రతి ఒక్కరూ చదువుపై ధ్యాస ఉంచి బాగా చదువుకుని తల్లిదండ్రుల కష్టాన్ని మరిచిపోయి గర్వంగా చెప్పుకునేలా మంచి అలవాట్లు, మార్కులు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేయడమైనది. పిల్లల కొరకు తల్లిదండ్రులు పడే కష్టం గురించి అర్థమయ్యేలా పిల్లలకు వివరించడం జరిగినది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి వివరించడమైనది. పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు SI బాల నరసింహులు చెప్పిన విధముగానే నగదు బహుమతులను అందజేయడం జరిగినది. 10 వ తరగతి మొదటి బహుమతి :M.మేఘన, రెండవ బహుమతి :- సంగీత, మూడవ బహుమతి :- మనీషా అదేవిధంగా రాబోవు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి విలువైన బహుమతులు అందజేస్తామని ఎస్ ఓ తెలియజేయడమైనది కేజీ బిజీ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.