
దేవర ఉత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని సులువాయి గ్రామంలో మంగళవారం జరిగిన శ్రీ శ్రీ కొల్లాపురమ్మ దేవి దేవర ఉత్సవాలకు ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు సమర్పించారు.దేవర ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కథ బయలు నాటక ప్రదర్శన కార్యక్రమానికి రూ.10,000/- నగదును గ్రామ పెద్దలకు అందజేశారు.ముందుగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గిరిమల్లప్ప,హనుమంతప్ప,చిన్న ఈరన్న,ఉశేనప్ప,గాధిలింగప్ప,పెద్ద నాగప్ప,వెంకటేష్,ఉచ్చిరప్ప,కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్,ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు,ఓబీసీ సెల్ తాలుకా ఉపాధ్యక్షులు మీసాల గోవిందు,ఎస్సీ సెల్ నాయకులు ఈరన్న,ఎమ్మార్పీఎస్ నాయకులు కత్తి రామాంజనేయులు,గూల్యం యల్లప్ప,ఎల్లార్థి మహేష్ గజ్జేహల్లి తాయన్న, ఖాజీపురం రాంబాబు,కోగిలతోట వీరేష్,రవి,విరూపాపురం బసవరాజు తదితరులు పాల్గొన్నారు.