
మాజీ అధికారి పై సిఐడి విచారణ ను వేగవంతం చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ యూనివర్శిటీ లో అవినీతి అక్రమాలకు పాల్పడిన మాజీ అధికారి పై సిఐడి విచారణ ను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్శిటీ ముఖద్వారం ఎదుట నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, భీమ్ ఆర్మీ రాష్ట్ర కన్వీనర్ యస్.విజయ భాస్కర్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కన్వినర్ మధుక్రిష్ణ లు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వర్శిటీ నందు ఉన్నత పదవులు పొంది ధనార్జనే ధ్యేయంగా పరిపాలన కొనసాగించి కొన్ని కీలక ఆర్థిక పరమైన అంశాలకు సంబందించి వొచర్స్, ఫర్నిచర్ మిస్సింగ్,కీలక ఫైళ్ల దొంగతనాలు ఇతర అంశాలకు సంబందించి విజిలెన్స్, సి ఐ డి కేసులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి పెండింగ్ కేసులపై విచారణ చేపట్టి వర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని అన్నారు.పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేసి యూనివర్సిటీ లో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్, అంజి, లోకునాయక్, శివ, తదితరులు పాల్గొన్నారు.