
పదవ తరగతి పరీక్షలు సజావుగా, కట్టుదిట్టంగా నిర్వహించాలి
స్వచ్చాఆంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం తో చేపట్టాలి…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్….
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లా కలెక్టర్ల తో విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జరగబోవు పదవ తరగతి పరీక్షలు మరియు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. బుధవారం సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై పలు సూచనలు, స్వచ్చాంధ్ర కార్యక్రమాలు మరియు పి 4 సర్వే , మొదలగు పలు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… రాష్ట్రంలో 6,19,275 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష వ్రా యబోతున్నారని. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ప్రతి పరీక్ష గది యందు సరియైన వెలుతురు , ఫ్యాన్లు , త్రాగునీటి సౌకర్యం, బాత్రూం సౌకర్యం కలిపించాలని , పరీక్ష వ్రాసే అభ్యర్థులు అందరూ నిర్దేశిత సమయం కు ఉండాలని, పరీక్షల నిర్వహణకు పోలీసు వారు ముందుగానే సంబంధిత పరీక్ష కేంద్రాలకు కావలసిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష గదికి పంపాలని , ఇన్విజిలేటర్లు ,సూపర్వైజర్లు, సిబ్బంది సెల్ ఫోన్లతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని , పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి మూడవ శనివారం ను స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ దివస్ గా పాటించి వంద శాతం ప్రజల భాగస్వామ్యం తో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్య ఉండాలని కోరారు. అన్ని ప్రవేట్ సంస్థలలో కూడా కార్యక్రమాలు జరిగే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సారి థిమ్ ” రీ యూజబుల్స్ ను ప్రోత్సహించే ఉద్దేశ్యం” కావున ఈ విధమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబరు 2 వ తారీఖు నాటికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 100% సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలని కోరారు.కిచెన్ గార్డెన్స్ ను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలయిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్, రెవెన్యూ సర్వీసెస్, ఆసుపత్రులు , గుడు లలో లు మొదలగునవి అమలు జరుగుతున్న తీరు పై ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో అభిప్రాయ సేకరణ ప్రజల నుండి ఐవిఆర్ఎస్ , వాట్సప్ , మరియు క్యూఆర్ కోడ్ ల ద్వారా సేకరించడం జరిగిందని అందులో కొన్ని జిల్లాలు కొన్ని విషయాల లో వెనుకబడి ఉన్నాయని తెలియజేశారు.వీటిని జిల్లా కలెక్టర్ లు సమీక్షించుకొని లోటు పాట్లు సరి చేసుకునే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ,జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య , ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్ పి సి ఈ ఓ, సిపిఓ, డిఈఓ, పీడీ డిఆర్డిఏ, జె.డి పశుసంవర్ధక శాఖ,ఎస్ ఇ ఆర్ డబ్లు ఎస్ ,ఎస్ ఇ ఇరిగేషన్, ఎస్ఇ పి.ఆర్, పి డి డ్వామా, మున్సిపల్ కమిషనర్ లు, డి ఎం హెచ్ ఓ, డి సి హెచ్, డి ఎస్ ఓ , పి డి ఐసిడిఎస్, టూరిజం అధికారులు పాల్గొన్నారు.