
కలెక్టరేట్ కార్యాలయంలో రేపు స్వచ్ఛత దివస్ పాటించాలి
ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు…
కర్నూలు, న్యూస్ వెలుగు; కలెక్టర్ కాంప్లెక్స్ లోని అన్ని కార్యాలయాలు రేపు స్వచ్ఛత దివస్ ను పాటించి తమ కార్యాలయాలను శుభ్రపరచు కోవలసిందిగా ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం సాయంకాలం కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని కార్యాలయాల అధికారుల సమావేశాన్ని ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు నిర్వహించారు. రేపటినుండి ప్రతినెల మూడవ శనివారం రోజును స్వచ్ఛత దివస్ పాటించవలసిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో అన్ని ప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించినందున కలెక్టరేట్ కాంప్లెక్స్ లో గల అన్ని కార్యాలయాలు ఎల్లప్పుడు తమ కార్యాలయాలు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగాకోరారు. అవకాశమున్న కార్యాలయాలు పూల మొక్కలను పెంచుతూ పరిసరాలను సుందరంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. ఈ సమావేశానికి పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు , జిల్లా కోపరేటివ్ అధికారి రామాంజనేయులు , ఇన్చార్జి చీఫ్ ప్లానింగ్ అధికారి భారతి మరియు ఇతర కార్యాలయాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.