చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా

కర్నూలు ఫోర్త్ టౌన్ పరిధిలో 11 ఒపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు

న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని చెన్నమ్మ సర్కిల్,రిజిస్టర్ ఆఫీస్, గుత్తి పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాలలో బహిరంగ మద్యం పై డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచి11 మంది పై కేసులు నమోదు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి పై నిరంతరం పర్యవేక్షణ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై చంద్రశేఖర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!