
జాతీయ అంతర్జాల సదస్సులో ప్రతిభ చాటిన క్లస్టర్ విద్యార్థులు
కర్నూలు, న్యూస్ వెలుగు; కె ఆర్ కె ప్రభుత్వ కళాశాల ఆద్దంకి నిర్వహించిన గణితమృతం జాతీయ అంతర్జాల సదస్సులో క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు డి నిఖిల్ సెకండ్ బీకాం, ఇ.లక్ష్మీనరసింహ సెకండ్ బిఎ సంయుక్తంగా సమర్పించిన అప్లికేషన్స్ ఆఫ్ బయో స్టాటస్టిక్స్ అనే పరిశోద నపత్రంలో ప్రథమ స్థానంలో ఎంపికై ఉత్తమ పరిశోధనగా పత్రంగా రూ 2000 నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్, రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ బిఆర్ ప్రసాద్ రెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తర్ బాను విజేతలను అభినందించారు. పరిశోధన వైజ్ఞానిక ఆవిష్కరణలో క్లస్టర్ యూనివర్సిటీ విద్యార్థులు ముందుండాలని వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ తెలిపారు.