వరద నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతి : వరద నష్టం వివరాలను వెల్లడించేందుకు విజయవాడ కలెక్టరేట్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అంతకు ముందు భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను, ముంపుకు గురైన ప్రాంతాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించి తగు సాయం అందించడానికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు.
వరద నష్టంపై విజయవాడలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూపిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వివరాలు అందించారు. వరద విషయం తెలుపగానే తక్షణ సహాయం అందించిన ప్రధాని నరేంద్రమోడీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి కృతజ్ఞతలు తెలిపారు. నష్టపోయిన ఉద్యానవన రైతుల 30,154 మంది కాగా , 3,756 కి.మీ. రోడ్లు దెబ్బ తిన్నట్లు సీఎం కేంద్రమంత్రికి వివరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ , వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , రాష్ట్రమంత్రులు నారాలోకేష్ , నారాయణ తదితరులు పాల్గొన్నారు.