మహిళలపై అఘాయిత్యాలు కీలక సూచనలు చేసిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి :
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి బ్యాచ్ లను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిమండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై నేడు సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!