హీరో అల్లు అరెస్ట్ పై స్పందించిన సీఎం
తెలంగాణ : సినీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
Was this helpful?
Thanks for your feedback!