ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలు గా మారుస్తున్న కూటమి నేతలు

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలు గా మారుస్తున్న కూటమి నేతలు

కర్నూలు, న్యూస్ వెలుగు; పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ దివ్యాంగుల క్రీడల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ జిల్లాస్థాయిలో 30వ తేదీ రాష్ట్రస్థాయిలో జరుగుతున్నయి. కర్నూలు జిల్లాలోని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్యారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రీడల పోస్టర్లను ఆవిష్కరించడాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ తీవ్రంగా తప్పు పట్టారు. దివ్యాంగులకు క్రీడలు నిర్వహించడాన్ని అభినందిస్తూనే దివ్యాంగుల పట్ల కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కు దివ్యాంగుల పట్ల వివక్ష చులకన భావం ఉండబట్టే కర్నూల్ లో ఇన్ని స్పోర్ట్స్ క్లబ్బులు ఉన్నప్పటికీ దివ్యాంగులకు ప్రభుత్వం నిర్వహించే క్రీడల పోస్టర్లను తన పార్టీ కార్యాలయంలో గోడపత్రికలను విడుదల చేశారని అన్నారు. వెంటనే దివ్యాంగులకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని దీనివల్ల రాజకీయాలకతీతంగా మంచి ప్రతిభావంతులైన దివ్యాంగులు ఇది తెలుగుదేశం కార్యక్రమము అనుకొని దూరంగా ఉండాల్సిన పరిస్థితిని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!