దూదేకుల సంక్షేమ సంఘాల అభివృద్ధికి సమిష్టి కృషి; సిద్దయ్య
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు గ్రామంలో ఆదివారం రాష్ట్ర దూదేకుల నూర్ భాష ఎంప్లాయ్ అధ్యక్షుడు D. సిద్ధయ్య , రాష్ట్ర దూదేకుల నూర్ భాష ఎంప్లాయ్స్ సెక్రటరీ D. కన్నయ్య , నంద్యాల జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు D. కాసింవలి ఖాదర్బాషా ఆధ్వర్యంలో దూదేకుల నూర్ భాష సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు సిద్దయ్య మాట్లాడుతూ రానున్న రోజులలో దూదేకుల నూర్ భాష సంఘ అభివృద్ధికి కలసి కట్టుగా వుండి చట్ట సభలో మనకంటూ స్థానం రావడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జమ్మలమడుగు దూదేకుల జనరల్ సంఘం కొత్త కమిటీని యన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కమిటీలో సంఘం అధ్యక్షుడు వనిపెంట దూదేకుల కిరణ్. ఉపాధ్యక్షుడు బెల్లంకొండ దస్తగిరి. ట్రెజరర్గా డి మస్తాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న పీరయ్య ఉప కార్యదర్శిగా డి హుస్సేన్నప్ప తదితరులను ఎన్నుకోవడం జరిగింది