
భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి
కర్నూలు, న్యూస్ వెలుగు ; సూరత్ నుండి చెన్నైకి వెళ్లే ఎక్స్ ప్రెస్ వే-150సీ కర్నూలు జిల్లాలో సుమారు 40 కిలోమీటర్ల మేరా వెళుతోందని. కర్నూలు జిల్లాలోని ఎదురూరు గ్రామం నుండి ప్రారంభమై కర్నూలు జిల్లా కేంద్రం మీదుగా పెద్దపాడు పందిపాడులక్ష్మీపురంమీదుగా వెళుతుందని. ఇందుకు కావాల్సిన భూసేకరణ జరిగిందని. భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన న్యాయమైన నష్టపరిహారం సక్రమంగా చెల్లించలేదని. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి దంభోళంశ్రీనివాసరావు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ కి రైతు సమస్యల పరిష్కారం కోసం ఇచ్చి కలెక్టర్ కి తెలిపారు. గ్రామాల దగ్గర వ్యవసాయదారులు, రైతులు, కూలీలు, మొదలైన వారు రోడ్డుకు కుడి నుండి ఎడమవైపు వెళ్లాలన్నా, ఎడమ నుండి కుడికి వెళ్లాలన్నా వెళ్లడానికి సరైన మార్గాలు లేవుఅని ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పెద్దపాడు, లక్ష్మీపురం, పందిపాడు సల్కాపురం మొదలైన గ్రామాల రైతులు, కూలీలు, వెళ్లేందుకు అనుకూలంగా రోడ్డుకు అండర్ బ్రిడ్జీ నిర్మించాలని. రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్లు రోడ్డు కిరువైపులా విద్యుత్ దీపాలు వేయాలని. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సిమెంట్ దిమ్మెలను తొలగించాలని. ఇనాం భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని. అలాగే పందిపాడు పెద్దపాడు లక్ష్మీపురం సల్కాపురం గ్రామాలను కలిపే సుమారు నలభై అడుగుల రోడ్డు యధా విధంగా రైతులకు ఉపయోగపడే ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు నడిచే విధంగా అండర్ బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ ని కోరారు కలెక్టర్ స్పందించి పెద్దపాడు పందిపాడు లక్ష్మీపురం సల్కాపురం గ్రామ రైతులకు ఎక్స్ప్రెస్ హైవే కి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తామన్నారు. కల్లూరు రైతు సంఘం నాయకులు బి రాముడు శివ నారాయణ కురువ వెంకటేశు కురువ వెంకటస్వామి కురువ సాంబశివుడు మొదలగు వారు పాల్గొన్నారు
ఇట్లు

