వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యపోస్టులపై ఫీర్యాదు
ఎస్.వి.మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు
కర్నూలు క్రైం, న్యూస్ వెలుగు; కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి నాయకులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై కర్నూలు రెండవ పోలీస్ స్టేషన్ లో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పిర్యాదు చేశారు.ఈ సందర్బంగా ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడారు.సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి అసభ్య పోస్టులు పెట్టడం దుర్మార్గం అన్నారు.కావున టిడిపి నాయకులు ఎంత పెద్ద పదవిలో ఉన్న కచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని రెండవ పట్టణ సిఐని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య,వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు, డైరెక్టర్లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!