
నకిలీ విద్యార్థి సంఘాలు కుల సంఘాలు నకిలీ విలేకరులపై కలెక్టర్ కు ఫిర్యాదు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: నకిలీ విద్యార్థి సంఘాలు నకిలీ కుల సంఘాలు నకిలీ విలేకరులపై నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా సంఘం అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య సంస్థల వద్దకు వచ్చి చందాలు ఇవ్వండి లేకుంటే మా సత్తా చూపిస్తాం అంటూ బెదిరిస్తున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. మాకు చందాలు ఇవ్వకుంటే మీ పాఠశాలలో సరైన వసతులు లేవని డీఈవో ఆర్జెడి మరియు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పాఠశాలను మూయిస్తామని విద్యాసంస్థల యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నకిలీ నుంచి తమ యాజమాన్యాలను కాపాడాలని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి భాస్కర్ కోశాధికారి హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.