
లీజుదారులపై ఫిర్యాదులు పునరావృతం కాకూడదు
న్యూస్ వెలుగు, కర్నూలు. నగరపాలక సంస్థ; నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులను వివిధ రూపాల్లో లీజుకు దక్కించుకున్న నిర్వాహకులు, వాటిపై ఎటువంటి ఫిర్యాదులు లేకుండా, నిబంధనల మేరకు సక్రమంగా నడుచుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ లీజుదారులకు సూచించారు. మంగళవారం గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని పార్కింగ్ స్థలం, బిర్లా కాంపౌండ్‌లోని వెండర్ జోన్‌తో పాటు కొత్త వి.యల్.టి., ఇంటి పన్నులకు సంబంధించి పలు ధరకాస్తు స్థలాలను అదనపు కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక ఆస్తులను లీజుకు తీసుకున్న తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, లీజుదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బిర్లా కాంపౌండ్‌లో వెండర్ జోన్ పనులు పూర్తి కావొచ్చాయని, త్వరలో కేటాయింపు ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. వియల్‌టి, ఆస్తి పన్ను విధించేటప్పుడు స్థలం, సంబంధిత పత్రాలను రెవెన్యూ ఇంస్పెక్టర్లు, క్షుణ్ణంగా పరిశీలించాలని, తమ పరిధిలో ఉన్న స్థలాల సర్వే నెంబర్లపై పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఓ జునీద్, ఆర్‌ఐలు, తిప్పన్న, భార్గవ్, ప్రత్యేక అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.