
పొదుపు మహిళలతో బలవంతపు కొనుగోళ్లు
గిన్నిస్ రికార్డు కోసం పొదుపు మహిళలపై వేధింపులు.
“మీడియా తో బలవంతం పెట్టడం లేదంటూనే మరోవైపు కచ్చితంగా ప్రతి ఒక్కరితో ఉత్పత్తులు కొనుగోలు చెపించాలి అని హుకుం చేస్తున్న పి డి’
“పట్టాన పేదరిక నిర్మూలన నా లేక కల్పన నా”
“మహిళ మార్ట్ పేరుతో జరిగిన దోపిడీ కి తెర పడకముందే మరో యాప్ తో దోపిడీ కి యత్నం”
కర్నూలు, న్యూస్ వెలుగు; కూలి నాలి చేసుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ చాలీచాలని ఆదాయంతో పొదుపులు చేసుకొని వాటి ద్వారా వ్యాపారాలను అభివృద్ధి చేసుకొనే పొదుపు మహిళలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారు తాము నిర్దేశించిన ఒక యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయాలి అని బలవంతానికి దిగారు వివరాల్లోకి వెళితే ” వావ్ జీని ” అనే ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడుపబడుతుందని ఇందులో జిల్లాల వారీగా పొదుపు సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను ఆయా జిల్లాల ద్వారా మెప్మ పిడి ద్వారా సి ఏం ఏం , సి ఒ,ఆర్ పి లను పురమాయించి ఒక్కో ఆర్ పి తమ సంఘం లో ఉన్న 25 గ్రూపుల ద్వారా కచ్చితంగా ఒక్కో గ్రూప్ కనీసం ఒక ఉత్పత్తి అయిన కొనవలసిందే అని కండిషన్ ను పెట్టీ విపరీతంగా ఆర్ పి లను వత్తిడి చేస్తున్నారు దీనితో ఆర్ పి లు తమ వద్ద ఉన్న 25 సంఘాల పొదుపు మహిళలను ఖచ్చితంగా కోనవలసిందే లేదంటే తమ ఉద్యోగాలు పోతాయంటు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇక ఉత్పత్తుల విషయానికి వస్తె కర్నూలు జిల్లాకు సంబంధించి కేవలం నాలుగు ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి అవి డోర్ మాట్ లు,క్యాండిల్ ,జుట్ బ్యాగ్,ఇవి 120 రు నుండి 160 రు వరకు ఉన్నాయి ఇవి పొదుపు మహిళలకు ఎంత వరకు ఉపయోగపడతాయి వీటి ఆవశ్యకత ఎంత ఉంది అనే విషయాల్ని పట్టించుకోకుండా అవసరం ఉన్న లేకున్నా కొనాలి అంటూ వత్తిళ్లు చేస్తున్నారని పొదుపు మహిళలు వాపోతున్నారు ఇక కొందరు ఆర్ పి లు పై అధికారుల వత్తిళ్లు తట్టుకోలేక ఆప్ ద్వారా కొనుగోళ్లు తమ సొంత డబ్బులు పెట్టీ పొదుపు మహిళల మొబైల్ నెంబర్ల ద్వారా లాగిన్ అయి వస్తువులు కొనుగోళ్లు చేస్తున్నారు అయిన యాప్ లోని సాంకేతిక లోపల ద్వారా చాలా వరకు డబ్బులు డెబిట్ అయిన అందులో పేమెంట్ కాలేదు వస్తువులు బుక్ కాలేదు అని చూపిస్తుంది దీనితో డబ్బులు డెబిట్ అయిన వస్తువులు బుక్ కాకపోవడం పై ఆర్ పి లు పొదుపు మహిళలు ఆందోళన చెందుతున్నారు ఈ వావ్ జిని యాప్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాలేదు అందులో ఆప్ కు సంబంధించి చాలా అవకతవకలు ఉన్నాయి సరైన సమాచారం లేదు.ఇన్ని జరుగుతున్నా పి డి మాత్రం గిన్నిస్ రికార్డు లో కోసం కచ్చితంగా చేయవలసిందే అంటూ వత్తిడి చేస్తున్నారు అలాగే ఇదే విషయమై కొందరు విలేకరుల మెమ్మ పి డి ను వివరణ కోరగా మేము ఎవరిని కచ్చితంగా కొనాలి అంటూ బలవంతం చేయడం లేదని ఎవరికి అవసరం ఉంటే వారు తీసుకోవచ్చని అయిన కూడా పొదుపు సంఘాలు చేసిన ఉత్పత్తులు కాబట్టి కొంటే ఏమవుతుంది మేము కూడా గిన్నిస్ రికార్డుకు అర్హులమవుతాము కదా అంటూ చెప్పకనే బలవంతం పెడుతున్నట్టు చెప్పింది మరి గిన్నిస్ రికార్డు కొరకు అవసరం ఉన్నా లేకున్నా పొదుపు మహిళలు కొనాలా వద్దా అనే దేశం గా మారింది దీనిపై సమగ్ర విచారణ జరిపించి సరైన అవగాహన కల్పించి అవసరం ఉన్నవారితో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అందరికీ బాగుంటుందని పొదుపు మహిళలు వాపోతున్నారు అలాగే మహిళా మాటు పేరుతో మా దగ్గర ఆర్పీలు సేవలు డబ్బులు వసూలు చేశారని వాటికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి వివరాలు తెలియదని అప్పట్లో కూడా కచ్చితంగా సరుకులు అక్కడే కొనాలి అని బలవంతపు కొనుగోలు చేపించారని పొదుపు చేసుకుని జీవితం సాగించి పిల్లాపాపలను పోషించుకునేదే కష్టంగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటివి పొదుపు మహిళలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని బలవంతపు కొనుగోలు ఇకనైనా ఆపాలని ఇష్టం ఉంటే తామే తీసుకుంటామని పొదుపు మహిళలు వాపోతున్నారు