ఉపాధ్యాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన ఆప్టా
న్యూస్ వెలుగు, అమరావతి; స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, నులకజోడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిపురపు శ్రీనివాస రావు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆప్టా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రకాష్ రావు పత్రిక ప్రకటనలో తెలియజేశారు. గతంలో కూడా ఇలాగే ఒక ఉపాధ్యాయుడు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరణించడానికి ఆట సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ శిక్షణా తరగతులను నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో జరపాలని కోరినప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు సరేనని చెప్పి మరల రెసిడెన్షియల్ పద్ధతిలో జరుపుతున్నారని దాని ఫలితంగా ఇంకొక ఉపాధ్యాయుడు మరణించారని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ మంత్రివర్యులు తక్షణమే స్పందించి ఈ శిక్షణా తరగతులను రద్దు చేయాలని ఆప్టా సంఘం తరఫున కోరుచున్నామని తెలియజేశారు చనిపోయిన శ్రీనివాస రావు కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని విద్యాశాఖ మంత్రి పత్రిక ద్వారా విన్నవించుకున్నారు