గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణ జరిపించండి:కాంగ్రెస్

గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణ జరిపించండి:కాంగ్రెస్

 

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యూస్ వెలుగు: రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మలికిపురంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు . మంటలు ఎగసి పడుతున్న దృశ్యా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. వెంటనే మంటలకు అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.  ఈ ఘటన మరో బ్లో అవుట్ కి దారి తీస్తుందని ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. తక్షణం చుట్టుపక్కల గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కోనసీమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంటలు అదుపులోకి తీసుకొచ్చే వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. మనవంతు సహాయక కార్యక్రమాలు నిర్వహించండి.

కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ ప్రాంతంలో ఈ మధ్య వరుస గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణ జరిపించండి. భయం గుప్పిట్లో బ్రతుకుతున్న గ్యాస్ పైప్ లైన్ పరివాహక ప్రాంతాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!