భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహణ
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామస్థాయి మండల స్థాయి ప్రజా భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ సదస్సులు అనే బృ హత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గురువారం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో మండల స్థాయి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సు సమావేశానికి రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సుగవాసి .బాలసుబ్రమణ్యం హాజరై అన్నారు. ముందుగా ఆయనకు మండల స్థాయి నాయకులు పూలమాలలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండల స్థాయి ప్రజా భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం రెవెన్యూ అధికారులతో ప్రవేశపెట్టడం శుభదాయకమన్నారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా ప్రజాధరణ పొందుతోందని సంతోషం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికై రెవెన్యూ సదస్సులు చక్కని వేదికగా నిలుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో భూ ఆక్రమణలు జరిగిన కారణంగా వాటిని వెలికి తీసేందుకై ప్రభుత్వము రెవెన్యూ సదస్సు అని నామకరణం చేసి నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని పేదల భూములను భూభకాసురులు ఆక్రమించుకున్నారని వాటిని వెలికి తీసి ప్రజలకు సమన్యాయం చేసే దిశగా తెలుగుదేశం ప్రభుత్వము పరుగులు పెడుతుందన్నారు. రైతుల మంచి కోరే ప్రభుత్వమని మాయ మాటలు చెప్పి రైతుల మెడకు ఉచ్చు బిగించి ల్యాండ్ టైటిలింగ్ అనే పేరు పెట్టి పేద రైతులను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని రద్దుచేసి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి భూ సమస్యలపై అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భూ బకాసురుల ఎవరో బయటకి లాగి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులలో భూ అక్రమాలు 22 ఏ భూ అక్రమాలతోపాటు పలు రకాల రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువు 45 రోజుల లోపల సమస్యలు పరిష్కరించడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆ దిశగా రెవెన్యూ యంత్రాంగం బాధ్యతలు చేస్తోందన్నారు. మండల స్థాయి రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రెవెన్యూ సదస్సుల పై అవగాహన కల్పించి ఈ సదస్సులో భూ సమస్యలు తీరుతాయి అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. ఇకమీదట బాధితులను పదేపదే కార్యాలయాలకు తిప్పించుకోకుండా ఈ కార్యక్రమంలోని అధికారులు సమస్యలు పరిష్కారం చేసి మండల ప్రజల మన్ననలు పొందాలన్నారు.ఈ సదస్సుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నాడు. రాబోయే రోజుల్లో జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించి పుల్ స్టాప్ పెట్టి అధికారులు తమ వంతు బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అనంతరం అధికారులు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జాన్ ఎర్విన్, ప్రత్యేక అధికారి బ్రహ్మయ్య, తాసిల్దార్ రమణమ్మ, ఉప తాసిల్దార్ అంజన గౌరీ ,మండల స్థాయి రెవెన్యూ సిబ్బంది, మండల నాయకులు గజ్జల .నరసింహారెడ్డి, కొత్తపల్లి. బొబ్బిలి రాయుడు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.