అయోమయంలో దీపం పథకం: కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు కోసం ప్రవేశపెట్టిన దీపం పథకం చాలా మంది మహిళల్లో అనుమానాలు ఉన్నాయని తమ ఖాతాలో డబ్బులు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదికి మహిళలకు ఉచితంగా దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు . అయితే చాలామంది డబ్బులు చెల్లిస్తున్న తమ ఖాతాలో డబ్బులు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అని తెలిపారు. వాస్తవానికి ఈ పథకం వల్ల 2684 కోట్ల భారం పడుతుంది అంటే ఐదు సంవత్సరాలకు 13,423 కోట్ల రూపాయలు భారం పడుతుందని ఆయన తెలిపారు. ఈ భారం ప్రభుత్వం పై పడిన భవిష్యత్తులో పడేది ప్రజలపైనేనని అని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఈ ఖర్చులు భరించాల్సింది ప్రజలేనని ఆయన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం ఉచిత పథకాల పేరిట ప్రజలను ఆకర్షించి అధికారంలో వచ్చిన తర్వాత ఆ భారం ప్రజలపై పడుతుందన్నారు. పన్నులు పెరుగుతాయని తెలిపారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించే ముందర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ఉంటుందో ఆలోచన చేయకుండా పథకాల ప్రవేశపెడితే అది లాభం పాలకులకే తప్ప అప్పుల భారం ప్రజలపై పడుతుందని అని తెలిపారు . ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందే వారు అర్హులు మిగతావారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు సులభంగా ఈ సిలిండర్ల పథకం అమలు అవుతుందని మిగతావారు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారంతా అర్హులేనని బీపీఎల్ కుటుంబాలు , తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు ,రేషన్ కార్డు ,మొబైల్ నెంబరు, విద్యుత్ బిల్లు , నేటివిటీ సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని అని తెలిపారు
.డబ్బులు పడలేదని ఆవేదన పడకుండా సంబంధిత గ్యాస్ కనెక్షన్ డీలర్ దగ్గరకు వెళ్లి వారి కోరిన డాక్యుమెంట్లు అన్ని ఇస్తే డబ్బులు పడే అవకాశం ఉంటుందని చాలామంది నిరక్షరాశులు వల్ల ఈ పథకం అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల సంఘాలు నిద్ర అవస్థలో ఉండటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రతి వార్డుల్లో శిబిరాల ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.