జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జరిగే గోల్డ్ మైనింగ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వే

జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జరిగే గోల్డ్ మైనింగ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వే

* ఎక్సపెర్ట్ మైనింగ్ ఇంజనీర్ తో సమీక్ష.

– పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ.

పత్తికొండ/తుగ్గలి వెలుగు న్యూస్ ప్రతినిధి: పత్తికొండలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ పరిధిలో పెట్టుబడులు వస్తున్నాయి అంటే సంతోష పడ్డాం అని కానీ పదేళ్ళు అయినా ఎటువంటి పురోగతి లేకపోవడం విచారకరం అని అన్నారు. ఇక్కడ ఉన్న భూములు అన్నీ మైనింగ్ కి ఇచ్చి ప్రజలు వలసపోయారు అని కానీ వీరికి కనికరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నో సమస్యలు ప్రజలు నుండి పార్టీ దృష్టికి రావడంతో సౌత్ ఆఫ్రికా లోని మైనింగ్ కంపెనీ వారిని అమరావతి లో ఈ అంశాల మీద కలవగా వారు మైనింగ్ నిపుణులను పంపుతామని అన్నారు.వారిని పిలిపించి జరుగుతున్న పరిణామాలు,ప్రజలు వినిపిస్తున్న సమస్యల మీద ఒక సభ వచ్చే వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బొల్లవానిపల్లి,ఉప్పర్లపల్లి,జొన్నగిరి రైతులకు గుత్తల విషయంలో సరైన పద్ధతి లేదు అని, మైనింగ్ వలన త్రాగు నీరు కలుషితం అవుతుందనే వాదన వినిపిస్తుంది అని,రైతుల భూములు కొనుగోలులో గందరగోళం జరుగుతుందని,జొన్నగిరి చెరువు కి నీరు అందకపోవడం,లోకల్ యువత కు 75% ఉద్యోగకల్పన అని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా మోసగించడం,కార్మికులకు ఆసుపత్రి సౌకర్యాలు లేకపోవడం, ఎండోమెంట్ భూములకు ఇచ్చే పరిహారం ఎవరికి ఇస్తున్నారు అనేది తెలియకపోవడం,ఆయా గ్రామాల్లో ఉండే దేవాలయాలకు ధూప దీప కోసం నిధి ఏర్పాటు చేశారా లేదా అనేది పొందు పరచకపోవడం,భారీ మైనింగ్ వాహనాల వలన రోడ్లు దెబ్బ తిన్నా కూడా ఎటువంటి చర్యలు లేకపోవడం, సిఎస్ఆర్ నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు అనే నివేదిక లేకపోవడం, ఫారెస్ట్ భూముల మీద రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్న ఇక్కడ ఎటువంటి చర్యలు లేకపోవడం, ఎన్వోసి ప్రభుత్వం ఎలా ఇచ్చింది అనేది ముఖ్యంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, ఇలాంటి ఎన్నో వాటి పైన ఒక ఎక్సపర్ట్ కమిటీ ను పిలిపించి మన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమాచారం సేకరించి లోకాయుక్త, హై కోర్టు ను కూడా ఆశ్రయిస్తాం అని, ముఖ్యమంత్రి దృష్టికి, అటవీ శాఖ మంత్రి పవన కళ్యాణ్ గారికి, పెట్టుబడుల మంత్రి భారత్ గారికి, సదరు మైనింగ్ మంత్రులకు ఇతర శాఖలకు లేఖ కూడా రాస్తున్నాం పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!