
ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో కరపతాలను ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా మాట్లాడుతూ ఫిబ్రవరి 15 ఆదోనిలో 48వ జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రధానంగా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు విద్యారంగం పైన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దానికి నిదర్శనమే కర్నూలు జిల్లా అక్షరాస్యతలో వెనుకబాటుకు ఒక ఉదాహరణని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా లో విద్యాభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వారన్నారు . ప్రభుత్వాలు మారుతున్న కర్నూలు జిల్లా లో ఉన్న విద్యార్థుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదని ఇంకా వెనుకబాటుకు గురవుతున్నారని అన్నారు ప్రతి మండల కేంద్రాల్లో పోస్ట్ మెట్రిక్ ప్రీమెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఆదోని లో మెడికల్ కాలేజ్ ను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలని సంక్షేమ హాస్టల్లో ఉన్న మౌలిక వసతులు కల్పించి ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు 3000 కి పెంచాలని జిల్లాలో ఉన్న యూనివర్సిటీల కు నిధులు కేటాయించి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి యూనివర్సిటీల అభివృద్ధికి దోహదపడాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు సాయి ఉదయ్ రవి తదితరులు పాల్గొన్నారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar