
భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథం
మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
నగరపాలక సంస్థ, కర్నూలు న్యూస్ వెలుగు; భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర గ్రంథం లాంటిదని నగరపాలక మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నగరపాలక కార్యాలయ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌ల చిత్రపటాలకు నివాళులర్పించారు. వేదికపై మేయర్, కమిషనర్, విభాగాధిపతులు ప్రసంగించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవ అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఎస్ఈ రాజశేఖర్, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయోలు, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు ఏ.వి. రమేష్ బాబు, మంజూర్ బాష, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.