శాశ్వత అంగన్వాడి భవనం నిర్మించండి
హోళగుంద, న్యూస్ వెలుగు:మండల కేంద్రంలోని 4వ వార్డులో గల 9 సెంట్ల ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా ఉందని ఈ స్థలంలో శాశ్వత అంగన్వాడి భవనం కానీ లేదా ప్రాథమిక పాఠశాల భవనం కానీ నిర్మించాలని శుక్రవారం కాలనీ వాసులు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,మండల అభివృద్ధి అధికారిణి విజయ లలిత,డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4వ వార్డులో గల 9 సెంట్ల ప్రభుత్వ స్థలంలో చెత్త చెదారం పేరుకోని పోయిందని దీనివలన దోమల,ఈగలు ఇళ్లలో చేరి ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఖాళీగా ఉన్న స్థలంలో చెత్త చెదారం రోడ్డు పైనే పడేయడం వల్ల రోడ్డు పై తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు.ఈ స్థలంలో ప్రభుత్వ అంగన్వాడీ భవనం కానీ లేదా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.అలాగే 4వ వార్డు నందు ప్రభుత్వ అంగన్వాడీ భవనం లేక గర్భిణీ స్త్రీలు,బాలింతలు మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లేక ఇక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.సదరు స్థలంలో అంగన్వాడీ భవనము కానీ,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కానీ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అబ్దుల్ ఖాదర్,తాహెర్,చాంద్ భాషా,తెదేపా యువ నాయకుడు మోహిన్,సద్దాం,వాహీద్,ఉజేర్,ఉజెఫా,అబ్దుల్లా,ఖలీల్,నూరుల్లా,మహమ్మద్ గౌస్,జుబేర్,మతిన్,నజీర్,వారిస్,సత్తార్,సుభాన్,ఆదం, తదితరులు పాల్గొన్నారు.