మార్చిలోగా పేదల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయాలి

మార్చిలోగా పేదల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయాలి

 మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర రావు
హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర రావు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని కడ్లెమాగి రహదారిలో ఉన్న లే-అవుట్ నందు మన ఇల్లు–మన గౌరవం పేరుతో లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో భాగంగా రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తోందని చెప్పారు.గత ప్రభుత్వ హయంలో నిలిచిన ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం పీఎంఏవై పథకంలో పేదల ఇళ్ళ పై దృష్టిపెట్టిందన్నారు.దీంతో గడువులోగా పేదల ఇళ్ళ నిర్మాణ పనులు పూర్తి చెయ్యాలని లక్ష్యాన్ని నిర్ధేశించిందని చెప్పారు.మరియు ఇళ్ళ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన లబ్దిదారులను జాబితా నుండి వారి పేరును తొలగిస్తామని తెలియజేశారు.మండల కేంద్రంలో 625 లే–అవుట్‌లు ఉన్నాయన్నారు.మొత్తం మీద ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2025 మార్చినాటికి ఇళ్ళు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుహాసినమ్మ,పిఆర్ఎఈ సోమప్ప, హౌసింగ్ ఏఈ రవి వర్మ,ఏపిఎం హనుమంతు,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి,టిడిపి మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్,టిడిపి నాయకులు ఎర్రి స్వామి,బసవ,వెంకటేష్,అబ్దుల్ సుభాన్,జాకీర్,తిప్పన్న,మోహిన్,దుర్గయ్య,తిక్క స్వామి, కాకి సీతయ్య,బాగోడి రామ,పిర, వలి భాష,సాయి బేస్, రామాంజనేయులు, సచివాలయం సిబ్బంది,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!