ఇంగలదహల్ హైస్కూల్ ను కాంప్లెక్స్ గా కొనసాగించండి

ఇంగలదహల్ హైస్కూల్ ను కాంప్లెక్స్ గా కొనసాగించండి

మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ టిడిపి సీనియర్ నాయకులు జి. చంద్రన్న

హొళగుంద, న్యూస్ వెలుగు;  మండలంలోని ఇంగలదహల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాదాపు 1964 సంవత్సరం నుండి ఉంది అంటూ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు జి. చంద్రన్న మాట్లాడుతూ ఎంతో మందికి మంచి భవిష్యత్ ను ఇచ్చిన ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలకు ఆనాటి నుండి నేటి వరకు పాఠశాల కాంప్లెక్స్ ఇవ్వడం జరిగింది.స్కూల్ కాంప్లెక్స్ లు వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అన్ని మౌలిక వసతులు 7.69 ఎకరాల స్థలం ఉంది ఇందులో ప్రహరీ గోడ నిర్మాణానికై పిల్లర్లు కూడా వేయడం జరిగింది.క్రీడా స్థలం,బాలుర వసతి గృహం, 20 మంది బోధన సిబ్బంది,స్కూల్ కాంప్లెక్స్ కు సంబంధించి 9 స్కూల్ లతో పక్కన గ్రామాలలో మంచి పేరుతో చరిత్ర కలిగిన స్కూల్ కాంప్లెక్స్ ను తీసివేయాలనే ఆలోచన మంచిది కాదని అన్నారు.ఈ స్కూల్ కాంప్లెక్స్ ను తొలగించటానికి ఎంఈఓ గారి కుట్ర కూడా ఇందులో ఉంది.కావున స్కూల్ కాంప్లెక్స్ ను తీసివేస్తే ఆ స్కూల్ కు సంబంధించిన గ్రామాల ప్రజలు అందరూ ఊరుకునేదేలేదని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!