14 న మూడవ ఫేజ్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్

కర్నూలు, న్యూస్ వెలుగు; పారామెడికల్ కోర్సులకు “మూడవ ఫేజ్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ఈ నెల 14న” పారామెడికల్ కోర్సులలో చేరటానికి మిగిలిన మొదటి రెండు ఫేజ్ లలో భర్తీ కానీ 7 సీట్లకు కి మూడవ ఫేజ్ అడ్మిషన్ ల కోసం ఈనెల 14 న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. చిట్టి నరసమ్మ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 3 వ ఫేజ్ కౌన్సెలింగ్ ఈనెల 8 వతేది ప్రకటించడం జరిగింది అని అది ఈ 14 వ తేదీ కి మార్చడం జరిగింది అని తెలిపారు. విద్యార్థులు అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్ లతో కౌన్సెలింగ్ కు హాజరు కావాలని తెలిపారు. మూడవ ఫేజ్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో రోస్టర్ అభ్యర్థులు లభించక పోతే మొదటి,రెండవ ఫేజ్ లలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కూడా ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చునని తెలిపారు. తదుపరి రోస్టర్ కు స్లయిడింగ్ లో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని తెలిపారు. సంబంధిత కోర్స్/సీట్ల సంఖ్య/రోస్టర్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. D. డార్క్ రూం అసిస్టెంట్ కోర్స్ లో BC(D) కు 1 సీటు,BC (A) కు 1 సీటు, DMIT కోర్స్ లో ST కి 1 సీటు, D. అనస్థీషియా కోర్సులో BC -C కి 1 సీటు,బీసీ(D) కి 1 సీటు, DMLT కోర్స్ లో BC-C కి 1 సీటు, Dip.E.C.G కోర్స్ లో SC కి 1 సీటు అందుబాటులో వున్నాయని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!