సిఐ మృతదేహానికి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు

 సిఐ మృతదేహానికి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న

శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు;  కడప పట్టణంలో పనిచేస్తున్న ట్రాఫిక్ సిఐ రామావత్ అర్జున్ నాయక్ కడపలోని తన నివాసంలో ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. కడప నుండి ఆదివారం నల్లమాడ మండలం అరవాండ్లపల్లి తాండాకు సిఐ మృత దేహాన్ని తీసుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు స్వగ్రామానికి వెళ్లి మృతదేహ నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని పోలీస్ శాఖ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల తోపాటు కడపఏఆర్ పోలీసుల గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ఈ అంత్యక్రియలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, నల్లమాడ సిఐ నరేందర్ రెడ్డి, సిబ్బంది, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!