కెవి సుబ్బారెడ్డి కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

కెవి సుబ్బారెడ్డి కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

రాంప్రసాద్ రెడ్డి మృతికి కారణమైన , కుటుంబానికి కోటి రూపాయలు  చెల్లించాలి

   విద్యార్థి యువజన సంఘాలు 

న్యూస్ వెలుగు, కర్నూలు; కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి. సంవత్సరం ఏఐ చదువుతున్న రామ్ ప్రసాద్ పెద్దటేకూరు దగ్గర బావిలో నిన్న శవమై తేలాడు. హాస్టల్లో ఉండాల్సిన రాంప్రసాద్ రెడ్డి బావకి ఎలా వెళ్లాడు, ఈత కూడా రాని రాంప్రసాద్ రెడ్డి మిత్రులతో కలిసి ఈత కెళ్ళి చనిపోయినట్టు వారి మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు కాకుండా బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చరి ముందు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే ఒక కొడుకు నలుగురు కూతుర్లు ఉన్న తండ్రి మంచి ఉన్నత విద్యావంతుడై కుటుంబాన్ని అక్కను పోసిస్తాడని చెప్పేసి భావిస్తే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా శవంగా ఇంటికి పంపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ నుండి బయటికి వెళ్లాలంటే అవుట్ పాస్ ఉండాలి తల్లిదండ్రుల పరిమిషన్ ఉండాలి అనే కళాశాల యజమాన్యం ఇప్పుడెందుకు ఆ పాసులను ఇప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కళాశాల యాజమాన్యంపై మరో ఇలాంటి ఘటన జరగకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత కుటుంబం విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగువాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ నాయకులు హర్ష మనోహర్ చింటూ శంకర్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష.

Author

Was this helpful?

Thanks for your feedback!