పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సిపిఎం

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సిపిఎం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, గ్రామ గ్రామాన పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల పంట నష్టానికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి స్వామినాథన్ కమీషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి అన్నారు . ఈ కార్యక్రమం మండల కార్యదర్శి పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రైతు నాయకులు ఎన్ బసిరెడ్డి,నాగరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వి సుబ్బరాయుడు ఏం డేవిడ్ సీనియర్ నాయకులు టి రామచంద్రుడు, సిఐటియు మండల నాయకులు రాజు,కిసాన్ సంఘం నాయకులు జాబిద్,అబ్రహం,రవి మాబు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘం ముఖ్య నాయకులు Nచంద్రబాబు, ఏ కోడూరు మాబు, ఏం శీను, నారాయణ, ఓబుళపతి, మధుపాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!