దళిత మహిళ  గోవిందమ్మ కుటుంబాన్ని రక్షించాలి 

దళిత మహిళ  గోవిందమ్మ కుటుంబాన్ని రక్షించాలి 

ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ

కర్నూలు,న్యూస్ వెలుగు ; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆరు నెలల క్రితం ఈరన్న అనే మాదిగ యువకుడు అదే గ్రామానికి చెందిన బీసీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామం వదిలి వెళ్ళిపోయారు తదనంతరం అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి బంధువులు కుల వివక్షత అంటరానితనంతో స్తంభానికి కట్టేసి దారుణంగా అవమానపరిచి వీధిలైట్లు ఆర్పి ఆమెను విచక్షణరహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి వికలాంగుడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నించారు వారిపై 307 సెక్షన్ నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ పంపి బాధిత గోవిందమ్మ కుటుంబానికి రక్షణ కల్పించి అండగా ఉండి న్యాయం చేసి జిల్లాలో కుల వివక్షత అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు, హత్యాచారాలు నివారించి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ అండ్ రెవెన్యూ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేశారు.ఎమ్మార్పీఎస్ఎస్ కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవింద్ మాదిగ,
ఎమ్మార్పీఎస్ మహిళ జిల్లా నాయకురాలు కళావతి మాదిగ, ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!