
ఘనంగా డాక్టర్. విలియం అర్థర్ స్టాంటన్ దొర జయంతి వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; డాక్టర్. విలియం అర్థర్ స్టాంటన్ దొర 157వ జయంతి వేడుకలను కర్నూలు లో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వడ్డెగేరి వద్దనున్న స్కంధ కాంప్లెక్స్ లో స్టాంటన్ దొర జయంతి సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఈవైద్య శిభిరాన్ని కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ రవీంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ స్టాంటన్ దొర కర్నూలులో సేవా కార్యాక్రమాలు చేశారని కొనియాడారు. స్టాంటన్ దొరను గుర్తుపెట్టుకొని ఆయన పేరుమీద సేవా కార్యాక్రమాలు జరపడం అభినందనీయమన్నారు. పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని కమీషనర్ తెలిపారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ పౌండర్ రవికుమార్ మాట్లాడుతూ స్టాంటన్ దొర కర్నూలు లో విద్యా,వైద్య సేవలు చేశారన్నారు. అమెరికా నుంచి వచ్చిన ఆయన భారతదేశం లో ఎన్నో మంచి పనులు చేశారని రవి కుమార్ తెలిపారు. ఈవైద్యశిభిరంలో బీపీ, షుగర్, ఇ.సి.జీ, డెంటల్ స్ర్కీమింగ్, చిన్న పిల్లల ఆరోగ్య సమస్యల పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన మందులు సైతం ఉచితంగా అందించారు. ఈకార్యక్రమంలో జి. రవికుమార్, ప్రసాదరావు, ప్రవీణ్ కుమార్, పుప్పురాజ్, మాదవరాజు, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar