ఆయుధాల పనితీరు పై పరిజ్ఞానం పెంచుకోండి ; జిల్లా ఎస్పీ 

ఆయుధాల పనితీరు పై పరిజ్ఞానం పెంచుకోండి ; జిల్లా ఎస్పీ 

కర్నూలు, న్యూస్ వెలుగు;  పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.ఏ.కె 47, SLR , ఫిస్టల్ ల ద్వారా జిల్లా ఎస్పీ ఫైరింగ్ సాధన ఆయుధ నైపుణ్యాలను పరీక్షించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం, దిన్నేదేవరపాడు గ్రామ దగ్గర ఉన్న జగన్నాథగట్టు సమీపంలోని ఫైరింగ్ రేంజ్ లో పోలీసు అధికారులు, సిబ్బందికి 2024 సంవత్సరంకు గాను 5 రోజుల పాటు పైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఫైరింగ్ ప్రాక్టీస్ లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు.ఫైరింగ్ లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ గురించి జిల్లా ఎస్పీ గారు దిశా నిర్ధేశo చేశారు.ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకోవాలన్నారు.
అత్యవసర సమయాలలో ప్రజల మాన,ధన,ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి, ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్ , నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!