ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధ్యం…
సర్పంచ్ గౌరవ సలహాదారులు సుల్తాన్
హుసేనాపురం గ్రామంలో ఘనంగా జల్సా కార్యక్రమం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని కడమకుంట్ల గ్రామ పంచాయతీలోని గల హుసేనాపురం గ్రామంలో గురువారం రోజున జల్సా కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు మత పెద్దలు అసిఫ్ ఇబ్రహీం(ఆఫీసాఫీ),అబ్దుల్ హక్ (మౌలానా),అమీర్ భాష (అఫీ ఇన్సాఫీ) హాజరయ్యారు.కడమకుంట్ల గ్రామ పంచాయతీ గౌరవ సలహాదారుడు సుల్తాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుసేనాపురం గ్రామంలో మొత్తం 100 ముస్లిం కుటుంబాలు ఉన్నాయని,ఈ గ్రామం నందు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారని,అయితే గ్రామం నందు అందరూ ఐక్యమత్యంతో కలిసి మెలిసి గ్రామ అభివృద్ధి కొరకు కలిసికట్టుగా ఉంటూ తమ పిల్లలను మంచి చదువులు చదివించుకుంటూ ఉన్నారన్నారు.ప్రధానంగా ఈ గ్రామం నందు ఉర్దూ భాష నందు దాదాపు 40 మంది యువకులు మంచి ప్రావీణ్యం పొంది వేరువేరు ప్రాంతాలలో ఉంటూ ఈ జల్సా కార్యక్రమం చేయాలని గ్రామ ప్రజలను,మత పెద్దలను సంప్రదించి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.అయితే ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది మౌలానాలు,25 మంది ఆఫీస్లు వీరికి ఒక ముక్తి పెద్దగా ఉంటారు.వీరందరికీ మరియు మత మసీదు పెద్దలకు గౌరవ సలహాదారుడైన సుల్తాన్ అందరినీ శాలువాలతో సన్మానించి,భవిష్యత్తులో ఈ గ్రామం నందు ప్రతి ఒక్కరు పిల్లలకు మంచి చదువులు చదివించాలని,చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి సన్మార్గంలో నడిపించి వారి బంగారు భవిష్యత్తు బాటకు తోడ్పాటు అందించాలని,భవిష్యత్తులో ఈ గ్రామాభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కూడా గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటుగా ఉంటూ మనమంతా ఐకమత్యంతో మెలగాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ బొజ్జులు,రాజా సాహెబ్,మాజీ సర్పంచ్ రాజా సాహెబ్, దస్తగిరి,కమల్,పీరా,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.