
రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం
బి శ్రీరాములు
చైర్మన్ రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల JAC
కర్నూలు, న్యూస్ వెలుగు; కరువు నేల రాయలసీమ అభివృద్ధి కేవలం రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల JAC చైర్మన్ బి.శ్రీరాములు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానంద్ రెడ్డి,నందికొట్కూరు శాసన సభ్యులు గిత్త జయసూర్య నాయకత్వంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల JAC చైర్మన్ బి.శ్రీరాములు రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానంద్ రెడ్డి నందికొట్కూరు MLA గిత్త జయసూర్య ముఖ్యమంత్రి దృష్టికి పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని అదేవిదంగా శ్రీశైలం నీటిముంపు బాధితులకు న్యాయం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,బెంగళూరు,కర్నూలు,హైదరాబాద్ ను కలుపుతూ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ ని అభివృద్ధి చేయాలన్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ని కోరారు.రాయలసీమ విద్యార్థి JAC చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువనేత బి.శ్రీరాములు మాట్లాడుతూ గోదావరి నీళ్ళు బనకచర్లకు మళ్లీంచి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న చంద్రబాబు  ఆలోచన చాలా గొప్పది అని కొనియాడారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar