గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యo
*పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో రహదారుల ఏర్పాటుకు చర్యలు.
*మండల కేంద్రంలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఇంచార్జీ వీరభద్ర గౌడ్.
హోళగుంద, న్యూస్ వెలుగు: గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీఠం వేస్తున్నారని ఆలూరు టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ అన్నారు.ఆదివారం పల్లె పండుగా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ బన్ని మహంకలమ్మ దేవాలయం,దిడ్డి కాలనీ,ఈబిసి కాలనీ,బిసి కాలనీ,1వ వార్డు రాజీవ్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.50 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.ముందుగా పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.అలాగే పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నూతన సిసి రోడ్లతో గ్రామాలకు కొత్తకళ రానుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎపీఓ భక్తవత్సలం,పిఆర్ఏఈ యమునప్ప,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,నాయకులు మిక్కిలినేని ప్రసాద్,ఎర్రి స్వామి,మాజీ మార్కేట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి,సర్పంచ్ తనయుడు పంపాపతి, జనసేన మండల కన్వీనర్ అశోక్, బిజెపి మండల అధ్యక్షుడు ప్రసాద్,జయప్ప గౌడ,కాడ సిద్దప్ప,దుర్గయ్య,అబ్దుల్ శుభాన్,దిడ్డి వెంకటేష్,తిక్క స్వామి,ఉలిగన్న, బెనకప్ప,అదాం,మోహిన్, జాకీర్,పిరన్న తదితరులు పాల్గొన్నారు